MI vs DC IPL 2024 Highlights: జస్ప్రీత్ బుమ్రా మైండ్ బ్లోయింగ్ యార్కర్.. పృథ్వీ షా దిమ్మతిరిగింది.. క్లీన్‌బౌల్డ్ వీడియో చూశారా..!

Jasprit Bumrah Yorker Video: ఢిల్లీ క్యాపిటల్స్‌ జరిగిన మ్యాచ్‌లో మైండ్ బ్లోయింగ్ యార్కర్‌తో పృథ్వీ షాను క్లీన్ బౌల్డ్ చేశాడు ముంబై పేసర్ బుమ్రా. 60 పరుగులతో జోరును మీదున్న పృథ్వీ షాతోపాటు అభిషేక్ పోరెల్‌ను ఔట్ చేసి ఢిల్లీని భారీ దెబ్బ తీశాడు. ఈ మ్యాచ్‌లో ముంబై 29 రన్స్ తేడాతో గెలుపొందింది.   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 8, 2024, 02:19 PM IST
MI vs DC IPL 2024 Highlights: జస్ప్రీత్ బుమ్రా మైండ్ బ్లోయింగ్ యార్కర్.. పృథ్వీ షా దిమ్మతిరిగింది.. క్లీన్‌బౌల్డ్ వీడియో చూశారా..!

Jasprit Bumrah Yorker Video: ఐపీఎల్‌ 2024లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా మూడు ఓటముల తరువాత ఢిల్లీ క్యాపిటల్స్‌ను 29 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల ఖాతా ఓపెన్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసి ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (49), ఇషాన్ కిషన్ (42), హార్థిక్ పాండ్యా (39), టిమ్ డేవిడ్ (45), రుమారియో షెపర్డ్ (39) దుమ్ములేపారు. ముఖ్యంగా షెపర్డ్ ఆఖరి ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నోకియా వేసిన ఈ ఓవర్లో ఏకంగా 32 పరుగులు పిండుకున్నాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల నష్టానికి 205 పరుగులకు పరిమితమైంది. పృథ్వీ షా (66), అభిషేక్ పోరెల్ (41), స్టివ్ స్టబ్స్ (71) పోరాటం సరిపోలేదు. కొయెట్జీ నాలుగు వికెట్లు తీయగా.. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.

Also Read: Ponnaganti Kura: పొన్నగంటి కూర పోషకాల పుట్ట.. డయాబెటిస్‌, అధిక బరువుకు చెక్‌!

లక్ష్య ఛేదనలో వార్నర్ (10) త్వరగా ఔట్ అయినా.. పృథ్వీ షా, అభిషేక్ పోరెల్ జట్టును ఆదుకున్నారు. రెండో వికెట్‌కు 88 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సమయంలో బౌలింగ్‌కు వచ్చిన అద్భుతమైన యార్కర్‌తో పృథ్వీ షాను క్లీన్ బౌల్డ్ చేశాడు. లెగ్ స్టంప్ టార్గెట్ చేస్తూ వేసిన బంతి.. పృథ్వీ షా కాళ్ల మధ్యలో దూసుకువెళ్లి స్టంప్స్‌ను పడగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ తరువాత అభిషేక్ పోరెల్‌ను కూడా బుమ్రా ఔట్ చేసి ముంబై విజయాన్ని ఖాయం చేశాడు. చివర్లో స్టబ్స్ సిక్సర్లతో సునామీ సృష్టించినా.. సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండడంతో విజయం కష్టంగా మారింది. స్టబ్స్ 25 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లో ఒక వికెట్ తీసిన షెపర్డ్‌కు మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓటములతో ఢిల్లీ చివరి స్థానానికి పడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. కేకేఆర్ 3 విజయాలు, 6 పాయింట్లతో రెండోస్థానంలో, లక్నో, చెన్నై మూడు, నాలుగు స్థానాల్లో ఉండగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదో స్థానంలో ఉంది.

Also Read:  PM Modi Fan Cut His Finger:మోదీ హ్యట్రిక్ పీఎం కావాలి.. వేలుకోసుకొని కాళీకా దేవికి అర్పించిన అభిమాని.. ఎక్కడంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News