Virat Kohli: వెళ్లు.. వెళ్లు.. వెళ్లవయ్యా.. రచిన్ రవీంద్రకు పెవిలియన్ వైపు వేలు చూపించిన విరాట్ కోహ్లీ

Virat Kohli Vs Rachin Ravindra: విరాట్ కోహ్లీ మైదానంలో ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా అగ్రెసివ్‌గా మైదానంలో కదలుతుంటాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో జోరుమీదున్న రచిన్ రవీంద్ర ఔట్ అవ్వగా.. వెళ్లు.. వెళ్లు.. అంటూ పెవిలియన్‌ వైపు వేలు చూపించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 23, 2024, 02:30 PM IST
Virat Kohli: వెళ్లు.. వెళ్లు.. వెళ్లవయ్యా.. రచిన్ రవీంద్రకు పెవిలియన్ వైపు వేలు చూపించిన విరాట్ కోహ్లీ

Virat Kohli Vs Rachin Ravindra: అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 ఎడిషనల్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉత్కంఠభరితమైన పోరు అభిమానులకు వినోదాన్ని పంచింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆటతీరును ప్రదర్శిస్తూ ఆర్‌సీబీ ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించింది చెన్నై. బౌలింగ్‌లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. బ్యాటింగ్‌లో రచిన్ రవీంద్ర, శివమ్ ధుబే మెరుపులు మెరిపించడంతో చెన్నై తొలి విక్టరీని నమోదు చేసింది. రుతురాజ్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌తోనే ఆకట్టుకున్నాడు. ధోని మార్గనిర్దేశంలో బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మార్పులు చక్కగా చేశాడు.

Also Read: Rythu Bandhu: రైతుబంధు కేవలం 5 ఎకరాల వరకేనా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది?

వన్డే వరల్డ్‌కప్‌లో మెరుపులు మెరిపించిన రచిన్ రవీంద్ర.. తన ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. కేవలం 15 బంతుల్లో 37 పరుగులు (3 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి.. అన్ని జట్లకు గట్టి హెచ్చరికలే పంపించాడు. రచిన్ దూకుడుతో చెన్నై లక్ష్యం వైపు కదిలింది. రవీంద్ర జడేజా, శివమ్ ధుబే ఎలాంటి టెన్షన్ లేకుండా టార్గెట్‌ను పూర్తి చేశారు. ఇక రచిన్ రవీంద్ర ఔట్ అయిన తరువాత విరాట్ కోహ్లీ రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది. కర్ణ్‌ శర్మ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన రచిన్.. తరువాతి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద రజత్ పాటీదార్‌కు దొరికిపోయాడు. వెంటనే విరాట్ కోహ్లీ వెళ్లిపో.. వెళ్లిపో.. అంటూ పెవిలియన్‌ వైపు రచిన్‌ రవీంద్ర వేలు చూపించాడు. 

 

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. డుప్లెసిస్ (35), అనుజ్ రావత్ (48), దినేశ్ కార్తీక్ (38) రాణించారు. రజత్ పటీదార్, మ్యాక్స్‌వెల్ డకౌట్ అవ్వగా.. విరాట్ కోహ్లీ 21 పరుగులు చేశాడు. అనంతరం చెన్నై 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్‌లో మెరుపులు మెరిపించిన ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌కు మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుండగా.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను సన్‌రైజర్స్ ఢీకొట్టనుంది.  

 

Also Read: PBKS Vs DC Dream11 Team Tips: నేడే రిషభ్ పంత్ రీఎంట్రీ.. పంజాబ్‌తో ఢిల్లీ ఫైట్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News