Jupiter Rise 2023 in Aries 2023: ఏప్రిల్ 27న ఉదయించనున్న గురు గ్రహం.. 5 రాశులకు ఉన్నత పదవులు, అంతులేని డబ్బు

Jupiter Rise 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల పరివర్తనానికి మహత్యం, ప్రాధాన్యత ఉన్నట్టే గ్రహాలు ఉదయించడానికి ఉంటుంది. నిర్ణీత సమయంలో గ్రహాలు వివిధ రాశుల్లో ఉదయించచం లేదా అస్తమించడం జరుగుతుంటుంది. ఇదొక నిరంతర ప్రక్రియ. దీని ప్రభావం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 11, 2023, 04:10 PM IST
Jupiter Rise 2023 in Aries 2023: ఏప్రిల్ 27న ఉదయించనున్న గురు గ్రహం.. 5 రాశులకు ఉన్నత పదవులు, అంతులేని డబ్బు

Jupiter Rise 2023 in Aries 2023: గురుడు రాశి పరివర్తనానికి ఏడాది సమయం పడుతుంది. గురుడు ప్రస్తుతం తన మీన రాశిలో అస్తమించి ఉన్నాడు. త్వరలోనే ఉదయించనుండటంతో 5 రాశులకు ఊహించని లాభాలు కలగనున్నాయి. అంతులేని ధనవర్షం కురవనుంది. ఏయే రాశులకు ప్రయోజనం కలగనుందో పరిశీలిద్దాం..

గురు గ్రహం 12 ఏళ్ల తరువాత మేషరాశిలో ప్రవేశించనున్నాడు. ప్రస్తుతం మీనరాశిలో ఉన్న గురుడు అందులోనే అస్తమించి ఉన్నాడు. త్వరలో అంటే ఏప్రిల్ 22వ తేదీన గురుడు రాశి పరివర్తనం చెంది మేష రాశిలో ప్రవేశిస్తాడు. 5 రోజుల తరువాత అంటే ఏప్రిల్ 27న గురు గ్రహం ఉదయించనున్నాడు. మంగళ గ్రహం రాశి మేషంలో గురుడు ఉదయించడం 5 రాశులకు ఊహించని లాభాలు కలగనున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత స్థానం లభిస్తుంది. ధనవర్షం కురుస్తుంది.

సింహ రాశి

గురు గ్రహం 12 ఏళ్ల తరువాత మేష రాశిలో ప్రవేశించి ఉదయించడం వల్ల సింహ రాశి జాతకం మెరిసిపోనుంది. ఊహించని ధనలాభం కలుగుతుంది. కెరీర్‌పరంగా అద్భుత లాభాలుంటాయి. అభివృద్ధి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. చదువు విషయంలో ప్రయోజనం కలుగుతుంది. 

తులా రాశి

తులా రాశి వారికి కూడా గురు గ్రహం ఉదయించడం అత్యంత లాభదాయకం కానుంది. అదృష్టం తోడుగా ఉంటుంది. ఆదాయం భారీగా పెరుగుతుంది. కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. కెరీర్ లాభపడుతుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. 

Also read: Jupiter Transit 2023 in Aries: ఏప్రిల్ 22న గురు గ్రహ సంచారం.. ఏడాది పాటు ఈ 5 రాశులకు తిరుగేలేదు

కుంభ రాశి

గురు గ్రహం ఉదయించడం ప్రభావంతో కుంభరాశి వారి కోర్కెలు పూర్తవుతాయి. డబ్బులు సంపాదించేందుకు కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. వ్యాపారం విస్తృతమై లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.

మేష రాశి

గురుడు మేష రాశిలో ప్రవేశించి తిరిగి అందులోనే ఉదయించనున్నాడు. గురుడు ఉదయించడం వల్ల మేష రాశి రాశి జాతకులకు విశేష లాభాల్ని అందిస్తుంది. ఈ జాతకం వారికి అదృష్టం పూర్తిగా తోడై ఉంటుంది. ఊహించని ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించవచ్చు. ఆదాయం పెరుగుతుంది. 

Also read: Jupiter Transit 2023: 12 ఏళ్ల తరువాత మేషరాశికి పట్టనున్న మహర్ధశ.. ఏప్రిల్ 22 నుంచి 3 రాశులకు వద్దన్న డబ్బు వస్తుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News