Budhaditya Yoga 2024: ఈ 3 రాశుల వారిపై బుధాదిత్య రాజయోగ ప్రభావం.. ఏ పనులు చేసిన డబ్బే డబ్బు!

Budhaditya Yoga 2024: మే 12వ తేదీన ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి అనుకున్న పనులు జరగబోతున్నాయి. అలాగే ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలిగే శక్తిని పొందబోతున్నారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 12, 2024, 09:18 AM IST
Budhaditya Yoga 2024: ఈ 3 రాశుల వారిపై బుధాదిత్య రాజయోగ ప్రభావం.. ఏ పనులు చేసిన డబ్బే డబ్బు!

 

Budhaditya Yoga 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈరోజు ఎంతో ప్రాముఖ్యత కలిగిన చంద్ర గ్రహం మేషరాశిలోకి సంచారం చేయబోతోంది. ఇప్పటికే ఈ రాశిలో బుధ గ్రహంతో పాటు సూర్య గ్రహం సంచార దశలో ఉన్నాయి. దీని కారణంగా అన్ని గ్రహాలు ఒకే రాశిలో కలువబోతున్నాయి. దీంతో ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. వైశాఖమాసంలోని కృష్ణపక్షం ఐదవ రోజున ఈ బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. కాబట్టి ఈ యోగానికి మరింత ప్రాముఖ్యత పెరిగిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ఎంతో శక్తివంతమైన రాజయోగం జాతకంలో శుభస్థానంలో ఉన్నవారికి పరితమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మేష రాశితో పాటు మకర రాశి వారికి జీవితం ఆనందదాయకంగా మారుతుంది. అయితే ఈ బుధాదిత్య రాజయోగం కారణంగా ఎక్కువగా లాభాలు పొందబోయే రాశుల వారెవరో.. ఎవరు ఎక్కువ లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

మిధున రాశి:
మిధున రాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణంగా మే 12వ తేదీ నుంచి అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి మానసిక ఆనందం లభించడమే కాకుండా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ సమయంలో ఎలాంటి పని చేసిన తప్పకుండా విజయాలు సాధిస్తారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. దీంతోపాటు కుటుంబ సభ్యులతో కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ఇంట్లో శాంతి కరమైన వాతావరణం నెలకొంది. అంతేకాకుండా భాగస్వామి మధ్య పరస్పరమైన చర్చలు జరగడం కారణంగా ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. దీంతో వీర ఆనందమైన జీవితాన్ని గడపగలుగుతారు. అలాగే వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలనుంచి కూడా ఎంతో సులభంగా విముక్తి లభిస్తుంది. 

కన్యా రాశి:
కన్యా రాశి వారికి ఈ బుధాదిత్య రాజయోగం చాలా శుభ్రంగా ఉంటుంది. మే 12వ తేదీ నుంచి వీరు ఎలాంటి పనులు చేసిన తప్పకుండా విజయాలు సాధించగలుగుతారు. మానసిక సమస్యలతో బాధపడే వారికి ఈ సమయంలో గొప్ప ఉపశమనం లభిస్తుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి ఒత్తిడి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరు స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ చేస్తారు. వ్యాపారాలు చేస్తున్నవారు ఈ సమయంలో చాలా బిజీగా ఉంటారు. దీంతోపాటు తండ్రి సంపాదించిన ఆస్తుల్లో వాటాలు కూడా లభిస్తాయి. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులకు పూర్తి మద్దతు లభించి, విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ఇక భాగస్వామ్య జీవితం గడుపుతున్న వారు ఈ సమయంలో శృంగార జీవితాన్ని గడపగలుగుతారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ బుధాదిత్య రాజయోగం అనేక శుభ ఫలితాలను అందించబోతోంది. ఈరోజు నుంచి వీరు పూర్తి విశ్వాసంతో ఉండడం వల్ల కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే విద్యార్థుల విషయానికొస్తే వారికి జ్ఞాపకశక్తి రెట్టింపు పై పరీక్షల్లో రాణించగలుగుతారు. ఇక కొంతమంది కుటుంబ సమేతంగా కలిసి తీర్థయాత్రలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. వ్యాపారాలు చేస్తున్నవారు ఈ సమయంలో రెట్టింపు లాభాలు పొందగలుగుతారు. అలాగే కుటుంబ జీవిత విషయానికొస్తే కుటుంబంలో ఈ బుధాదిత్య రాజయోగం కారణంగా సంతోషకరమైన సమయాలు ఏర్పడతాయి. ఒంటరి జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం చాలా శుభ్రంగా ఉంటుంది. అలాగే వీరికి వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News