Janhvi Kapoor: క్రికెట్ బాల్స్ డ్రెస్.. జాన్వి కపూర్ స్టైల్ చూసి ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor Stylish Photos: మహేంద్రసింగ్ ధోని బయోపిక్ గా వస్తున్న మిస్ అండ్ మిస్సెస్ మహి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది జాన్వి కపూర్. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో స్టైలిష్ గా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది.

1 /5

సినిమా రంగంలోకి అడుగుపెట్టింది శ్రీదేవి కూతురుగానే అయినా.. తన నటనతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది హీరోయిన్ జాన్వి కపూర్

2 /5

జాన్వి.. బాలీవుడ్ లో ఎంతో పేరు తెచ్చుకున్న బోనీకపూర్.. కూతురు కూడా కావడం విశేషం. అయితే ఈ హీరోయిన్ అక్కడ కేవలం గ్లామరస్ పాత్రలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా.. తన పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ వచ్చింది

3 /5

అందుకే అందాల తారగా మిగిలిపోకుండా.. పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ హీరోయిన్ మంచి మార్కులు కొట్టేసింది. ఇక కొద్ది రోజుల్లోనే తెలుగులో కూడా జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరా. సినిమాతో డెబ్యు ఇవ్వనుంది.

4 /5

మొదటి సినిమా విడుదల కాకముందే తన రెండో సినిమా రామ్ చరణ్ తో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాకు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుసాన దర్శకత్వం వహిస్తున్నారు.  

5 /5

కాగా ప్రస్తుతం జాన్వి కపూర్ హిందీలో మిస్టర్ అండ్ మిసెస్ మహి.. సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. మహేంద్రసింగ్ ధోని బయోపిక్ రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం క్రికెట్ బాల్స్ వెనకున్న డ్రెస్ వేసుకొని అందరిని ఆకట్టుకుంది ఈ హీరోయిన్.