TS Weather: పోలింగ్ రోజు భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం..

Telangana Weather Update: తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీగా వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది.
 

1 /6

తెలంగాణలో కొన్నిరోజులుగా భానుడు తన ప్రతాపం చూపించాడు. చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలను దాటేశాయి. ప్రజలు బైటకు వెళ్లాలంటేనే బెంబెలెత్తిపోయారు. అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లొద్దని నిపుణులు సైతం తెలిపారు. ఇదిలా ఉండగా రెండు రోజుల నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

2 /6

ప్రస్తుతం తెలంగాణలోని చాలా ప్రాంతాలలో ఒక మోస్తరు నుంచి భారీగా వర్షం కురిసింది. ఉక్కపోతత్తో అల్లాడి పోయిన జనాలు వర్షం పడటంతో కాస్త ఉపశమనం దక్కిందని భావిస్తున్నారు. అనేక చోట్ల ఈదురుగాలులతో వర్షంక కురిసింది. పిడుగు పాటుకు తెలంగాణలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి.  

3 /6

ఇదిలా ఉండగా తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో ఒక ఈదురు గాలులలో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈనేపథ్యంతో తెలంగాణకు ఆరెంట్ అలర్ట్ ను జారీచేసింది. కొన్ని ప్రాంతాలలో వర్షాలు భారీగాను, మరికొన్ని చోట్ల ఈదురు గాలులు వల్ల వర్షాలు పడోచ్చన వాతావరణ కేంద్రం తెలపింది.  

4 /6

మరో రెండు రోజుల్లో తెలంగాణ లో ఎన్నికలు జరుగున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాతావరణం పూర్తిగా చల్లబడింది.అనేక ప్రాంతాలలో భారీగా వర్షంపడొచ్చంటూ కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం నుంచి వాతావరణం పూర్తిగా దట్టమైన మేఘాలు అలుముకుంటున్నాయని తెలపింది.

5 /6

ఈ క్రమంలో తెలంగాణాలోని.. ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి,కరీంనగర్ఓ, మెదక్, హైదరాబాద్, కామారెడ్డి, వనపర్తి జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ను జారీచేసింది.

6 /6

ముఖ్యంగా ఓటింగ్ నేపథ్యంలో వర్షంరావోచ్చన్న నేపథ్యంలో ప్రజలకు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎండ వేడిమిని భరించలేక కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని ఒక గంట పాటు పెంచిన విషయం తెలిసిందే.