Protein Rich Vegetables: మాంసాహారంలోనే కాదు.. ఈ కూరగాయల్లో కూడా ప్రోటీన్లు అధికమే!

Protein Rich Foods for Vegetarians: సాధారణంగా ప్రోటీన్ ఫుడ్ అంటే మాంసాహారమే గుర్తొస్తుంది. కానీ శాకాహారంలో ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయల్లో సైతం ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఏయే కూరగాయల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 31, 2023, 05:40 PM IST
Protein Rich Vegetables: మాంసాహారంలోనే కాదు.. ఈ కూరగాయల్లో కూడా ప్రోటీన్లు అధికమే!

Protein Rich Foods for Pure Vegetarian: శరీర నిర్మాణం, ఎదుగుదల, ఆరోగ్యం కోసం ప్రోటీన్లు చాలా అవసరం. ప్రోటీన్ల కోసం ఎక్కువగా గుడ్లు లేదా మాంసం లేదా చేపలు తినమని వైద్యులు సూచిస్తుంటారు. శాకాహారులు ఎక్కువగా ఉండే ఇండియా పరిస్థితి ఏంటి మరి. ప్రోటీన్లు శాకాహారంలో లభించవా..?

శరీరానికి కావల్సిన ప్రోటీన్లు కేవలం మాంసాహారంలో మాత్రమే ఉండవు. ఆకుపచ్చ కూరగాయల్లో సైతం ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా 4 రకాల కూరగాయల్లో ప్రోటీన్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. శరీర నిర్మాణం, ఎదుగుదల, ఆరోగ్యానికి ఇవి ఉపయోగపడతాయి. ప్రోటీన్లు కేవలం గుడ్లు, చేపలు, మాంసంలోనే ఉంటాయనుకోవడం కేవలం భ్రమ. పరిమాణం పరంగా మాంసాహారంలో ఎక్కువ ఉండవచ్చు. కానీ శాకాహారంలో కూడా ప్రోటీన్లు లభ్యమౌతాయి. ముఖ్యంగా పాలకూర, కాలిఫ్లవర్, బ్రోకోలి, మష్రూంలలో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. 

పాలకూర ఆకుకూరల్లో అత్యంత అద్భుతమైన ప్రయోజనాలు కలిగిందిగా చెప్పవచ్చు. రుచిలో, పోషక విలువలపరంగా పాలకూరది అగ్రస్థానం. ఇందులో ప్రోటీన్లతో పాటు విటమిన్ బి, ఫైబర్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. పాలకూర ఎక్కువగా తినడం వల్ల కండరాలు బలంగా ఉంటాయి.

Also Read: Thief Booked Cab to Escape: వ్యాపారి ఇంట్లో చోరీ.. క్యాబ్ బుక్ చేసుకుని మరీ పరారీ..

ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తినడం వల్ల శరీరం ఇమ్యూనిటీ గణనీయంగా పెరుగుతుంది. శాకాహారంలో ముఖ్యంగా మష్రూం చాలా మంచి ప్రత్యామ్నాయం. మష్రూంలో ప్రోటీన్లు చాలా ఎక్కువ పరిమాణంలో లభిస్తాయి. అంటువ్యాధుల ముప్పు తగ్గుతుంది. వ్యాధులు కూడా పెద్దగా బాధించవు.

ఆకుకూరల్లో మరో అద్భుతమైంది కాలిఫ్లవర్. ఇందులో ప్రోటీన్లు, కేలరీస్, మెగ్నీషియం, ఐరన్ కావల్సిన పరిమాణంలో లభిస్తాయి. చలికాలంలో మార్కెట్‌లో విరివిగా లభించే కాలిఫ్లవర్ ఏడాది పొడుగునా కూడా అందుబాటులో ఉంటుంది. కాలిఫ్లవర్ తింటే శరీరానికి కావల్సిన ప్రోటీన్లు లభించినట్టే.

బ్రోకోలి చూడ్డానికి కాలిఫ్లవర్‌లా కన్పిస్తుంది. కానీ ఇది ప్రత్యేకమైంది. ఆరోగ్యానికి చాలా మంచిదని ప్రతి ఒక్కరూ చెబుతారు. బ్రోకోలి క్రమం తప్పకుండా తినడం వల్ల ప్రోటీన్లతో పాటు ఐరన్ కూడా కావల్సినంత లభిస్తుంది. రోజూ డైట్‌లో బ్రోకోలి చేర్చడం వల్ల కండరాలు బలోపేతమౌతాయి.

Also Read: Healthy Breakfast: బలమైన ఇమ్యూనిటీ కావాలంటే రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇది తీసుకోవల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News