Jr NTR: సతీ సమేతంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఏకంగా బాలీవుడ్ పార్టీలో..

NTR with Ranbir Kapoor and Alia Bhatt: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్.. త్వరలో బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న సినిమాలో వార్ 2 సినిమాలో తారక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ తన భార్యతో పాటు.. ఒక బాలీవుడ్ పార్టీలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.   

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 29, 2024, 04:48 PM IST
Jr NTR: సతీ సమేతంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఏకంగా బాలీవుడ్ పార్టీలో..

NTR in Bollywood Party: ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పేరు బాలీవుడ్ లో కూడా మారుమ్రోగిపోయింది. దీంతో అక్కడ తన మార్కెట్ మరింత పెంచుకోవడానికి తారక్ త్వరలోనే బాలీవుడ్ సినిమా వార్ 2 లో కనిపించనున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్.. దేవరతో పాటు తన బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2 చిత్రం పనుల్లో కూడా బిజీగా ఉన్నారు.

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన వార్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు వార్ 2 అనే సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై లో శరవేగంగా జరుగుతోంది.
ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటూ ముంబైలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఒక బాలీవుడ్ డిన్నర్ పార్టీకి కూడా అటెండ్ అయ్యారు. తన భార్యతో కలిసి తారక్ ఒక బాలీవుడ్ పార్టీలో కనిపించి ఫోటోలకి ఫోజులు ఇచ్చారు. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది.

ముంబైలోని ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిన ఒక బాలీవుడ్ పార్టీలో.. ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి తో పాటు దర్శనమిచ్చి.. ఫాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు. హృతిక్ రోషన్, సభా ఆజాద్, అలియా భట్, రణబీర్ కపూర్, కరణ్ జోహార్ తదితర స్టార్ బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. 

హోటల్‌లో పార్టీ కాబట్టి భారీ సంఖ్యలో అభిమానులు కూడా అక్కడ సెలబ్రిటీస్ ని చూడడానికి ఎంతో ఆసక్తి చూపించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ను చూడగానే ఒక అభిమాని ఇవాళ తన పుట్టిన రోజు అని గట్టిగా అరిచింది. దాంతో తారక్ ఆమెను పిలిచి మరీ ఆమెతో ఫోటో దిగి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

ఇక వార్ 2 సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలింస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

Also Read: DE Suspend: మాజీమంత్రి మల్లారెడ్డి మీటింగ్‌లో కరెంట్‌ కట్‌.. ఉద్యోగి పోస్టు ఊస్ట్‌

Also Read: Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్‌ ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News