Bank Holidays: పెరగనున్న బ్యాంకు సెలవులు, త్వరలో వారానికి 5 రోజుల పని విధానం

Bank Holidays: బ్యాంక్ కస్టమర్లకు అతి ముఖ్యమైన గమనిక. త్వరలో బ్యాంకుల సెలవులు మరింత పెరగనున్నాయి. నిత్యం బ్యాంకు పనులుండేవారు తప్పకుండా తెలుసుకోవల్సిన అంశం. ఎప్పటి నుంచి, ఎన్ని సెలవులు పెరగనున్నాయనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 19, 2023, 09:54 AM IST
Bank Holidays: పెరగనున్న బ్యాంకు సెలవులు, త్వరలో వారానికి 5 రోజుల పని విధానం

Bank Holidays: బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్, కస్టమర్లకు ఇబ్బంది కల్గించే అంశం. త్వరలో అంటే డిసెంబర్ నుంచి బ్యాంకుల సెలవులు పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ ఎదురుచూస్తున్నదే ఇది. నిత్యం బ్యాంకులతో పనులుండే కస్టమర్లకు మాత్రం ఇబ్బంది ఎదుర్కోక తప్పదు. ఆ వివరాలు మీ కోసం..

బ్యాంకులకు వారానికి రెండు సెలవుల ప్రతిపాదన గత కొద్దికాలంగా పెండింగులో ఉంది. అంటే వీక్లీ 5 డేస్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని బ్యాంకులకు అమలు చేయాలనేది చాలా కాలంగా ప్రతిపాదనలో ఉంది. ఇది అమలైతే ఇక నుంచి శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవుంటుంది. ఈ విధానాన్ని డిసెంబర్ నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బ్యాంకులకు వారానికి ఐదు రోజుల విధానం అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఎప్పట్నించో డిమాండ్ చేస్తున్నాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కూడా ఈ డిమాండ్‌కు అంగీకరించింది. అంటే వారానికి ఐదు రోజుల పని విధానం దాదాపు కొలిక్కి వచ్చినట్టే కన్పిస్తోంది. 

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఈ  డిమాండ్‌ను ఇప్పటికే కేంద్ర ఆర్ధిక శాఖకు పంపించింది. కేంద్ర ఆర్ధిక శాఖ దీనిపై ఆమోదముద్ర వేస్తే తక్షణం అమల్లోకి రావచ్చు. అంటే కేంద్ర ఆర్ధిక శాఖ వద్ద ఈ ప్రతిపాదన పెండింగులో ఉంది. కేంద్ర ఆర్దిక శాఖ కూడా ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2024 ఎన్నికలకు ముందే ఈ విషయమై బ్యాంకు ఉద్యోగులు గుడ్‌న్యూస్ వినవచ్చు. ఇది అమలైతే ఇకపై మొదటి, మూడవ శనివారాలు కూడా బ్యాంకులకు సెలవులే ఉంటాయి. అయితే బ్యాంకు పని గంటలు మాత్రం పెరగనున్నాయి. రోజుకు 45 నిమిషాల కంటే ఎక్కువ పెరగవచ్చు.

బ్యాంకు యూనియన్లు చేసిన ఈ ప్రతతిపాదనను కేంద్ర ఆర్ధిక శాఖ ఆమోదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్ధిక రంగ నిపుణులు మాత్రం కేంద్ర ఆర్ధిక శాఖ ఈ ప్రతిపాదనను తిరస్కరించే అవకాశాల్లేవంటున్నారు. అయితే ఇది బ్యాంకు కస్టమర్లకు మాత్రం ఇబ్బంది కల్గించే పరిణామం కానుంది. నిత్యం బ్యాంకుు పనులుండేవారికి, లేదా ఎప్పుడైనా ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. 

Also read: Credit Cards Limit Reduction: మీ క్రెడిట్ కార్డు లిమిట్ భారీగా కట్ అయిందా ? ఐతే రిస్కే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News