Banks Five Day Week: బ్యాంకులకు వారానికి ఐదురోజులే పనిదినాలు, కొత్త టైమింగ్స్ ఇలా

Banks Five Day Week: కార్పొరేట్ కంపెనీలే కాదు..ప్రభుత్వ రంగ సంస్థలు సైతం వారానికి 5 రోజుల పనికి శ్రీకారం చుట్టనున్నాయి. దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో ఇకపై వారానికి ఐదు రోజుల పనిదినాలు ప్రారంభం కానున్నాయి. దాంతోపాటు పని వేళలు కూడా మారుతున్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 4, 2023, 10:28 AM IST
Banks Five Day Week: బ్యాంకులకు వారానికి ఐదురోజులే పనిదినాలు, కొత్త టైమింగ్స్ ఇలా

Banks Five Day Week: బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్. కస్టమర్లకు ముఖ్య గమనిక. ఇకపై ప్రభుత్వ రంగ బ్యాంకులు వారానికి ఐదు రోజులే పనిచేయనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. పని దినాలు మారితే పని వేళలు కూడా మారబోతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇప్పటికే ప్రతి ఆదివారంతో పాటు రెండు, నాలుగవ శనివారాలు బ్యాంకులకు సెలవుంది. ఇకపై అదనంగా మరో రెండు శనివారాలు కూడా బ్యాంకులు పనిచేయవు. అంటే వారానికి రెండ్రోజులు బ్యాంకులకు సెలవు ఇవ్వనున్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయమై త్వరలో ప్రకటన చేయవచ్చు. బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పనిదినాలు అందించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ కోరాయి. బ్యాంకు సంఘాల నుంచి ఇప్పటికే ప్రతిపాదన కేంద్ర ఆర్ధిక శాఖకు వెళ్లింది. వేజ్ బోర్డ్ రివిజన్‌తో పాటు కొత్త నోటిఫికేషన్ త్వరలో జారీ చేయవచ్చని తెలుస్తోంది. ఇది అమల్లో వస్తే బ్యాంకు కస్టమర్లకు కచ్చితంగా ఇబ్బందులు కలగవచ్చు. 

అయితే ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇస్తే బ్యాంకు ఉద్యోగుల పని వేళలు కూడా మారనున్నాయి. రోజుకు మరో 40 నిమిషాలు అదనంగా పనిచేయాల్సి వస్తుంది. ఈ నిబంధనపై బ్యాంకు యూనియన్లు కూడా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. అంటే కొత్త టైమింగ్స్, కొత్త పని దినాలపై కేంద్రం నుంచి త్వరలో ప్రకటన వెలువడటమే ఆలస్యం. బ్యాంకులకు వారానికి 5 రోజుల పని దినాలు ప్రారంభమైతే..రోజుకు 40 నిమిషాలు అదనంగా పనిచేయాల్సి వస్తుంది.

మే నెలలో ఇప్పటికే బ్యాంకులకు 12 రోజులు సెలవులున్నాయి. మే 7, 14, 21, 28 ఆదివారాలు కాగా, మే 13, మే 27 రెండు, నాలుగవ శనివారం సెలవులున్నాయి. వీటికితోడు బుద్ధ పూర్ణిమ, మహారాణా ప్రతాప్ జయంతి వంటి పండుగలున్నాయి. బ్యాంకులకు సెలవులున్నా సరే కస్టమర్లు ఆన్‌లైన్ సేవల్ని నిరాటంకంగా పొందవచ్చు. అంటే ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.

Also read: Vida Scooter Price Cut 2023: శుభవార్త చెప్పిన హీరో మోటోకార్ప్‌.. తగ్గిన విడా స్కూటర్ల ధరలు! ఏకంగా 25 వేలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News