Jagga Reddy: అందరికీ వెల్‌కమ్.. రండి కండువా కప్పేస్తాం: జగ్గారెడ్డి

Telangana Lok Sabha Elections 2024: ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చిన కాంగ్రెస్ కండువా కప్పేస్తామని జగ్గారెడ్డి అన్నారు. పార్టీలో చేరికలపై ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని.. పార్టీకి నష్టం చేసిన వారిని అయినా చేర్చుకుంటామన్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 25, 2024, 11:34 PM IST
Jagga Reddy: అందరికీ వెల్‌కమ్.. రండి కండువా కప్పేస్తాం: జగ్గారెడ్డి

Telangana Lok Sabha Elections 2024: ఇతర పార్టీల నుంచి ఎవరు కాంగ్రెస్‌లో చేరినా చేర్చుకోవాలని ఏఐసీసీ ఆదేశించిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. పార్టీ అభ్యర్థికి నష్టం చేసినవాళ్లు అయినా.. చేర్చుకోవాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. నాయకులు ఎవరు నారాజ్ కావద్దని.. అందరూ కలిసి పని చేయాలని సూచించారు. తనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్లు వచ్చి చేరినా తను అభ్యంతరం చెప్పనని అన్నారు.  ఏఐసీసీ కంటే ఇక్కడ తోపులు ఎవరూ లేరంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు చేరికల ఎలాంటి కండీషన్లు లేకుండా పార్టీలోకి చేర్చుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Also Read: KCR Bus Yatra: నా వయసైపోతుంది.. యువకుల్లారా ఇక తెలంగాణ మీదే: కేసీఆర్‌

ఎన్నికల వరకు కాంగ్రెస్‌ పార్టీలో పని చేసి.. ఎలక్షన్స్ టైమ్‌లో కొందరు బయటకు వెళ్లారని.. వాళ్ళందరి విషయంలో పార్టీ తిరిగి చేర్చుకోవాలని AICC పీసీసీకి ఆదేశించిందని జగ్గారెడ్డి తెలిపారు. BRS నుంచి ఎవరు వచ్చినా చేర్చుకోవాలని ఆదేశాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్‌లోకి ఎవరు రావాలని అనుకున్నా.. కండువా కప్పేస్తామని చెప్పారు.  కండీషన్లతో చేరికలు ఉండవని.. ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్లతో స్థానిక నాయకులకు కొంత ఇబ్బంది ఉంటుందన్నారు. 

'నాకు కొందరు వ్యతిరేకంగా పని చేశారు. వాళ్లతో ఓడిపోయిన.. వాళ్లను ఎందుకు చేర్చుకోవాలని నాకు కోపం ఉంటది. కానీ పార్టీ ఆదేశించింది కాబట్టి కండువా కప్పాల్సిందే.  AICC కంటే తోపులు ఇక్కడ ఎవరు లేరు.  పార్టీలో చేరిన వాళ్లు కాంగ్రెస్ ఇంచార్జీల, ఎమ్మెల్యేల కిందనే పని చేయాలని పార్టీ ఆదేశించింది. పార్టీలోకి చేరే వాళ్లంతా డిక్లరేషన్ ఇవ్వాలి. జవాబుదారీగా చేరికలు ఉంటాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఓడిపోయినా వాళ్లు ఎవరూ నారాజ్ కావద్దు. మీడియా ముందు రచ్చ చేయొద్దు. ఇది అధిష్టానం ఆదేశం. అందరూ కలిసి పని చేయాల్సిందే' అని జగ్గారెడ్డి అన్నారు.
 
కాంగ్రెస్ పార్టీకి నిర్దిష్ట సిద్ధాంతం, నియమాలు ఉన్నాయన్నారు. ప్రాంతీయ పార్టీలకు అవకాశవాదమే ఎజెండా అని అన్నారు. బీజేపీ కూడా రూపాంతరం చెందిందని.. అద్వానీ.. మోదీ వేర్వేరు పద్ధతిలో విధ్వంసం చేశారని విమర్శించారు. మతాల మధ్య చిచ్చు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌లో చేరతామని ఒత్తిడి వస్తోందని.. రెండు రోజుల్లో గాంధీ భవన్‌లో చేరికలు ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో త్వరలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సభలు ఉంటాయని తెలిపారు. మే 1 నుంచి తాను ప్రచారంలో పాల్గొంటానని అన్నారు. 

Also Read: Renault Kiger Price: టాటా పంచ్‌తో పోటీ పడుతున్న Renault Kiger.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇలా! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News