Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్.. నిలిచిపోయిన వాహనాలు

Hyderabad Weather Live Updates: హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నగరంతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షానికి సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Written by - Ashok Krindinti | Last Updated : May 16, 2024, 06:38 PM IST
Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్.. నిలిచిపోయిన వాహనాలు
Live Blog

Weather Live Updates in Telugu: భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ నెల 19న అండమాన్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు వెల్లడించింది. నెలాఖరులో కేరళను  నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత వారంలో ఏపీలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశిస్తాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ,ద్రోణి ప్రభావంతో కేరళ, తమిళనాడులో వర్షాలు.. కోస్తాంధ్ర, సీమ జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురుస్తాయంది  గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురుస్తోంది. సంగారెడ్డిలోనూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద ఉండరాదని, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. వర్షానికి సంబంధించి లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి..
 

16 May, 2024

  • 18:38 PM

    Andhra Pradesh Weather Live Updates: ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ  పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
     

  • 18:11 PM

    Telangana Weather Live Updates: హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రోడ్‌ నంబర్‌ 45 నుంచి ఐకియా చౌరస్తా వరకు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి కోహినూర్‌ హోటల్ వరకు, విప్రో జంక్షన్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • 17:48 PM

    Telangna Weather Live Updates: రాజన్న సిరిసిల్ల జిల్లా పిడుగుపాటుతో ఇద్దరువ్యక్తులు మృతి చెందారు. తంగలపల్లి మండలం ఇందిరానగర్ గ్రామంలో రుద్రారపు చంద్రయ్య అనే రైతు తన పొలం వద్ద పొలం  పనులు చేసుకుంటుండగా.. పిడుగు పడి అక్కడిక్కడే మృతి చెందాడు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్ పల్లిలో పిడుగుపాటుతో కంబల్ల శ్రీనివాస్ (30) అనే వ్యక్తి మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. 

  • 17:08 PM

    Hyderabad Weather Live Updates: గ్రేటర్ హైదరాబాద్‌  పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది. అరగంటలో అత్యధికంగా 5 సెంటీ మీటర్ల వాన పడింది. యూసఫ్‌గూడలో 5.1 సెంటీ మీటర్లు, ఖైరతాబాద్‌లో 4.8, ఆదర్శ నగర్ లో 4.4, శ్రీనగర్ కాలనీలో 4.2, బాలానగర్ ఫిరోజ్ గూడలో 4.2, బంజారాహిల్స్ 4.2, రాయదుర్గంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
     

  • 17:03 PM

    Hyderabad Weather Live Updates: హైదరాబాద్‌తో పాటు వర్షం పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 
     

  • 16:56 PM

  • 16:53 PM

    Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం కారణంగా రోడ్లపై నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది.

  • 16:32 PM

    Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుండడంతో నేడు సన్‌రైజర్స్, గుజరాత్ టైటాన్స్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై అనుమానాలు నెలకొన్నాయి. మరో రెండు గంటలు భారీ వర్షాలు ఉండడంతో మ్యాచ్‌ జరగడం అనుమానంగా మారింది. ఒక వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ నేరుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.

  • 16:30 PM

    Hyderabad Rains Live Updates: హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు గంట నుంచి ఏకధాటిగా వాన పడుతోంది. దీంతో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. సహాయం కోసం 040-21111111 లేదా 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలని పేర్కొంది. వర్షం వేళ అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించింది.
     

Trending News