Hyderabad Metro: జర్నీవేళల్లో ఎలాంటి మార్పులు ఉండవు.. క్లారిటీ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో..

Hyderabad Metro : మెట్రో రైలు సమయాల పెంపు మీద తమ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న విధంగానే.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మెట్రో రైళ్లు నడుస్తాయని స్పష్టం చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : May 18, 2024, 06:11 PM IST
  • ఫ్రీ బస్సు జర్నీ మెట్రోపై ఎఫెక్ట్ ..
  • మెట్రో టైమింగ్స్ పై వివరణ ఇచ్చిన అధికారులు..
Hyderabad Metro: జర్నీవేళల్లో  ఎలాంటి మార్పులు ఉండవు.. క్లారిటీ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో..

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులకు సంబంధించి జరుగుతున్న ప్రచారంను మెట్రో అధికారులు ఖండించారు. మెట్రో రైలు సాధారణ పని వేళలు ఉదయం 6.00 గంటల నుంచి రాత్రి 11.00 వరకు మాత్రమేనని తెల్చి చెప్పారు. ప్రయాణికుల సౌకర్యం  కోసం అన్ని శుక్రవారాలు, సోమవారాల్లో మాత్రమే సర్వీసుల పొడిగింపుపై ప్రతిపాదనలు చేస్తున్నామని, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకు, ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు మెట్రో రైళ్ల రాకపోకలపై అధ్యయనం చేశామన్నారు. ఇంకా ఈ పొడిగింపుపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సర్వీసులు పొడిగింపు పరిశీలిస్తున్నట్టు మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికులు మెట్రో రైళ్ల సమయాల విషయంలో ఆందోళనలకు  గురికావొద్దని, యథావిధి సమయాల్లోనే రాకపోకలు ఉంటాయని మెట్రో అధికారులు క్లారిటీ ఇచ్చారు.

Read more: TTD Online Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. డిటెయిల్స్ ఇవే..

అదే విధంగా.. సోమవారాల్లో మొదటి రైలు ఉదయం 6 గం.లకు కాకుండా ఉదయం 5.30 గం.లకు బైల్దేరుతుంది. తద్వారా అదనంగా 30 నిమిషాల సర్వీసు అందించినట్లవుతుంది. ముందుగా పేర్కొన్నట్లు, ఇది ట్రయల్ ప్రాతిపదికన మాత్రమే ఉందని మెట్రో అధికారులు తెలిపారు.. ట్రాక్, రైళ్ల మెయింటెనెన్స్ షెడ్యూల్‌ను సర్దుబాటు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించిన మీదట, అలాగే డిమాండ్‌ను బట్టి తుది నిర్ణయం తీసుకోబడుతుందన్నారు.  

మెట్రో వేళల విషయంలో ఎటువంటి గందరగోళం తలెత్తకుండా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని మీడియాను కోరుతున్నట్లు ఎల్అండ్‌టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇటీవల హైదరాబాద్ మెట్రో రైలును అమ్మకానికి పెడుతున్నట్లు ఎల్‌ అండ్‌ టి సంస్థ ప్రెసిడెంట్‌, సీఎఫ్‌వో ఆర్‌.శంకర్‌ రామన్‌ ప్రకటించారు.

Read more: Vijayawada boy cpr: నువ్వు గ్రేట్ తల్లీ.... రోడ్డుపైన బాలుడికి సీపీఆర్ చేసిన లేడీ డాక్టర్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. వైరల్ గా మారిన వీడియో..

కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ‘మహాలక్ష్మి’ స్కీమ్‌ కారణంగానే మెట్రోలో రద్దీ భారీగా తగ్గిందన్నారు. ఫ్రీ బస్సు పథకంతో మెట్రో ఆదాయం పడిపోయిందని, దీని వల్ల మెట్రో రైళ్ల నిర్వహణ ఎలా పాజిబుల్ అవుతుందని ఆయన ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ కూడా తొందరలోనే దివాళా తీసే పరిస్థితి వస్తుందన్నారు.  మెట్రో అధికారులు క్లారిటీతో ప్రస్తుతం , రైళ్లలో ప్రయాణించే వారికి ఒక క్లారిటీ లభించినట్లైందని చెప్పుకొవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News