Durgam Cheruvu Cable Bridge: భాగ్యనగరానికి మరో మణిహారం

భాగ్యనగర ఖ్యాతిని మరింత ప్రకాశింపజేసేలా.. హైదరాబాద్‌ (Hyderabad)లో మరో అత్యాధునిక నిర్మాణం చేరింది. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి (Cable Bridge) అందాలు నగానికే ప్రత్యేక శోభను తీసుకువస్తున్నాయి.

Last Updated : Sep 26, 2020, 09:29 AM IST
Durgam Cheruvu Cable Bridge: భాగ్యనగరానికి మరో మణిహారం

Hyderabad durgam cheruvu cable bridge inaugurated: హైదరాబాద్: భాగ్యనగర ఖ్యాతిని మరింత ప్రకాశింపజేసేలా.. హైదరాబాద్‌ (Hyderabad)లో మరో అత్యాధునిక నిర్మాణం చేరింది. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి (Cable Bridge) అందాలు నగానికే ప్రత్యేక శోభను తీసుకువస్తున్నాయి. ఆసియాలోనే పెద్దదైన అద్భుతమైన కేబుల్ వంతెనను తెలంగాణ (Telangana) ప్రభుత్వం, జీహెచ్ఎంసీ శుక్రవారం హైదరాబాద్ ప్రజలకు అంకితం చేశాయి.

cable bridge inaugurated ktr and G. Kishan Reddy

రూ.184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జిని కేంద్రమంత్రి జీ. కిషన్‌రెడ్డి (G. Kishan Reddy) తో కలిసి రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే. తారక రామారావు (KTR) ప్రారంభించారు. దీంతోపాటు దీంతోపాటు దుర్గంచెరువులో బోటింగ్‌ను, కేబుల్ వంతెనకు అనుసంధానంగా జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 45 నుంచి నిర్మించిన ఎలివేటర్ కారిడార్‌ను కూడా వారు ప్రారంభించారు. దీనికి ‘పెద్దమ్మతల్లి ఎక్స్‌ప్రెస్ వే’ గా పేరును సైతం పెట్టారు. Also read: AP ICET-2020 ఫలితాలు విడుదల.. 78శాతం మంది ఉత్తీర్ణత

735.639 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పుతో దుర్గం చెరువుపై నాలుగు లేన్లతో నిర్మించిన ఈ కేబుల్ వంతెనతో జూబ్లీహిల్స్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ మధ్య దూరంతోపాటు, ట్రాఫిక్‌ తగ్గనున్నది. ఈ వంతెన ప్రారంభం అనంతరం మంత్రులు దుర్గంచెరువులో బోటింగ్‌ చేశారు. నేతలు, అధికారులతో కలిసి పడవలో ప్రయాణిస్తూ అందాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో  సీఎస్ సోమేశ్ కుమార్‌తోపాటు మంత్రులు తలసాని, సబితారెడ్డి, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, తదితతరులు పాల్గొన్నారు. Also read: MS Dhoni, CSK vs DC match: చెన్నై బ్యాట్స్‌మెన్, బౌలర్లపై కన్నెర్ర చేసిన ధోనీ

Trending News