MLA Raja Singh: మరో ఏడాదిలో బీజేపీ ప్రభుత్వం.. రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

MLA Raja Singh on Congress Govt: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ చేసిన అప్పులు తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపోతుందన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Dec 6, 2023, 03:48 PM IST
MLA Raja Singh: మరో ఏడాదిలో బీజేపీ ప్రభుత్వం.. రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

MLA Raja Singh on Congress Govt: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో సంవత్సరం తరువాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో మాదిరి తెలంగాణలో కూడా భవిష్యత్‌లో రాజకీయ సంక్షోభం రానుందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజా సింగ్ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. బుధవారం మీడియాతో మాట్లాడిన రాజా సింగ్.. తెలంగాణలో కాంగ్రెస్‌ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదన్నారు. 

ఒక సంవత్సరం మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుందన్న రాజా సింగ్.. ఆ తరువాత బీజేపీ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పిన కేసీఆర్‌ను., తెలంగాణ ప్రజలు మార్చేశారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీఆర్ అంబేద్కర్ వర్ధంతి క్యార్యక్రమానికి రాజా సింగ్ హాజరయ్యారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చేక్రమంలోనే కాంగ్రెస్ చతికిలపడుతుందన్నారు. ఏడాదిలోపే ఆ పార్టీ చేతులెత్తేస్తుందన్నారు. కేసీఆర్ రాష్ట్రంలోని దళితులకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిచినందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.  

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించనున్నారు. ఈ వేడుకకకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇతర ఏఐసీసీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలంటూ.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆ రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం పంపించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడులను కూడా ఆహ్వానించారు. అయితే వీరు ముగ్గురు హాజరవుతారా..? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 

Also Read: CM YS Jagan Mohan Reddy: ఏపీపై మిచౌంగ్ తుపాను భారీ ఎఫెక్ట్.. సీఎం జగన్ కీలక ప్రకటన  

Also Read: Arvind Krishna: FIBA లీగ్‌లో హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా సినీ హీరో.. దుమ్ములేపుతున్నాడుగా..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News