IPL RCB vs DC: ఇంకా ప్లేఆఫ్స్ రేసులోనే బెంగళూరు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ పని ఖతం

IPL Live Chennai Super Kings Won Against RR Still Playoff Race: ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడానికి తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ముందడుగు వేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓటమితో ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 12, 2024, 11:07 PM IST
IPL RCB vs DC: ఇంకా ప్లేఆఫ్స్ రేసులోనే బెంగళూరు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ పని ఖతం

IPL 2024 RCB vs DC Live: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2024లో ముందడుగు వేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అద్భుతం చేసింది. ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో కీలక మ్యాచ్‌ను చేజిక్కించుకుని ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవం చేసుకుంది. ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు--- పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది.

Also Read: IPL CSK vs RR: రాజస్థాన్‌కు భారీ షాక్‌.. చెన్నై అద్భుత విజయంతో ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం

 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 9 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (27), కామెరూన్‌ గ్రీన్‌ (32), మహిపాల్‌ లమ్రోర్‌ (13), కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (6), కర్ణ్‌ శర్మ (6) అతి తక్కువ పరుగులు సాధించారు. క్లిష్ట సమయంలో రజత్‌ పాటిదార్‌ 52 పరుగులతో సత్తా చాటగా.. విల్‌ జాక్స్‌ (41) స్కోర్‌తో రాణించాడు. ఢిల్లీ బౌలర్లు పరుగులు ఇస్తూనే వికెట్లు తీయడం విశేషం. ఖలీల్‌ అహ్మద్‌, రసీఖ్‌ సలామ్‌ రెండేసి చొప్పున వికెట్లు పడగొట్టారు. ఇషాంత్‌ శర్మ తన స్నేహితుడు విరాట్‌ కోహ్లీ వికెట్‌ తీయడం మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముకేశ్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News