HCA Cricket Coach: క్రికెట్‌కే మాయని మచ్చ.. మద్యం తాగుతూ బస్సులో మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన

HCA Suspends Coach: క్రీడలు నేర్పించాల్సిన కోచ్‌ అసభ్య చర్యలకు పూనుకున్నాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆ కోచ్‌ దారుణాలకు పాల్పడుతున్నాడు. బస్సులో మద్యం సేవిస్తూ మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. చివరకు అతడిపై హెచ్‌సీఏ కఠిన చర్యలు తీసుకున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 16, 2024, 04:05 PM IST
HCA Cricket Coach: క్రికెట్‌కే మాయని మచ్చ.. మద్యం తాగుతూ బస్సులో మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన

Cricket Coach Jai Simha: ఇప్పుడిప్పుడే వివాదాలు సద్దుమణుగుతున్న సమయంలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో మరో వివాదం రాజుకుంది. ఓ క్రికెట్‌ కోచ్‌ మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. నీళ్ల సీసాలో మద్యం పోసుకుని బస్సులో ప్రయాణిస్తూ తాగాడు. తాగడమే కాకుండా బస్సులో ఉన్న మహిళా క్రికెటర్లతో అసభ్యంగా వ్యవహారించాడు. ఈ విషయాన్ని మహిళా క్రికెటర్లు మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంటనే గుర్తించిన హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం వెంటనే అతడిని బహిష్కరించింది.

Also Read: Oye Re Release: 'ఓయ్‌' రీ రిలీజ్‌ క్రేజ్‌.. థియేటర్‌లో యువతి డ్యాన్స్‌ అదుర్స్‌ వావ్ వావ్

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో మహిళా క్రికెటర్ల కోచ్‌గా జైసింహా కొనసాగుతున్నారు. ఇటీవల మహిళా క్రికెటర్లు బస్సులో ప్రయాణిస్తుండగా జైసింహా బాటిల్‌లో మద్యం పోసుకుని వచ్చాడు. బస్సులో బహిరంగంగా బాటిల్‌ తీసి మద్యం సేవించడం మొదలుపెట్టాడు. అనంతరం మద్యం సీసాను బస్సు సీటు వెనుకాల పెట్టాడు. ఈ సందర్భంగా మద్యం మత్తులో జై సింహా మహిళా క్రికెటర్లను దూషించాడు. వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వ్యవహారాన్నంతా మహిళా క్రికెటర్లు వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోతోపాటు ఓ లేఖను మెయిల్‌ ద్వారా హెచ్‌సీఏకు ఫిర్యాదు చేశారు. ఈనెల 12వ తేదీన మెయిల్‌ ద్వారా మహిళా క్రికెటర్లు ఫిర్యాదు పంపారు.

Also Read: Pushya Masam: తెలంగాణలో కొత్త పండుగ.. వదిన మరదళ్లు ఇవి ఇచ్చిపుచ్చుకోవాలంట..

తాజాగా ఆ ఫిర్యాదును, వీడియోను పరిశీలించిన హెచ్‌సీఏ అధ్యక్షుడు అరిషనపల్లి జగన్‌మోహన్‌ రావు తక్షణమే స్పందించారు. వెంటనే అతడిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. 'మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం వాటిల్లితే ఉపేక్షించేది లేదు. వారికి హెచ్‌సీఏ అండగా ఉంటుంది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం. మహిళా క్రికెటర్లపై వేధింపులకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తాం. విచారణ ముగిసే వరకు కోచ్‌ జైసింహాను సస్పెండ్‌ చేస్తున్నాం' అని జగన్‌మోహన్‌ రావు ప్రకటించారు.

కాగా తనపై వచ్చిన ఆరోపణలపై కోచ్‌ జైసింహా తప్పుబట్టారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బుకాయించారు. కాగా జైసింహా బస్సులో మద్యం సేవిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అతడి వ్యవహార శైలిపై మహిళలు మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల ద్వారా అమ్మాయిలు క్రీడల్లో రాణించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News