Sun Transit 2023: సూర్యుడి సింహ రాశి ప్రవేశంతో ఆ రాశి జాతకులు ఇవాళ్టి నుంచి తస్మాత్ జాగ్రత్త

Sun Transit 2023: గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉన్నాయి. ఏ గ్రహం రాశి మారినా ఆ ప్రభావం అన్ని రాశులపై తప్పకుండా పడుతుంటుంది. అయితే కొన్ని రాశులపై అనుకూలంగా, మరి కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 17, 2023, 07:31 AM IST
Sun Transit 2023: సూర్యుడి సింహ రాశి ప్రవేశంతో ఆ రాశి జాతకులు ఇవాళ్టి నుంచి తస్మాత్ జాగ్రత్త

Sun Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. అదే విధంగా సూర్యుడు సింహరాశిలో ప్రవేశించనుండటం అన్ని రాశులపై ప్రభావం పడినా ముఖ్యంగా ఓ రాశివారిపై అత్యధికంగా ఉండనుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

సూర్యుడు ఏ రాశిలో ప్రవేశించినా నెల రోజులే ఉంటాడు. నెల తరువాత మరో రాశిలోకి మారిపోతుంటాడు. అదే విధంగా సింహ రాశిలో ఇవాళ ఆగస్టు 17న ప్రవేశించి సెప్టెంబర్ 17 వరకూ ఉంటాడు. ఈ సందర్బంగా కుంభ రాశి జాతకులపై అత్యధిక ప్రభావం ఉంటుందంటున్నారు జ్యోతిష్య పండితులు. ముఖ్యంగా రిలేషన్స్ విషయంలో తేడా రాకుండా చూసుకోవాలి. అంటే బంధుత్వాల్లో విబేధాలు లేకుండా జాగ్రత్త పడాలి. ఇతరులతో మీ వ్యవహారం చాలా మృదువుగా ఉంటే మంచిది. ఈ సందర్భంగా మీలో అధికారం పెరగవచ్చు. కచ్చితత్వంగా ఉంటారు. అదే సమయంలో ఎదుటి వ్యక్తుల్నించి కూడా అదే ఆశిస్తారు. దాంపత్య జీవితంలో ఒకరిపై మరొకరు విశ్వాసం, నమ్మకంతో జీవితం సాగించాల్సి వస్తుంది. 

ఇక కుంభ రాశి జాతకులు తమ విధుల నిర్వహణలో మరింత కష్టపడాల్సి వస్తుంది. ప్రతి విషయంలోనూ కచ్చితత్వం ఉండాలనే ఆలోచన కాస్త పక్కనబెట్టడం మంచిది. లేకపోతే చేతికొచ్చిన అవకాశాలు చేజారవచ్చు. పనిచేసే చోట ఇతరులతో ఈర్ష్యతో ఉండవద్దు. ఇది మంచిది కాదు. వ్యాపారంలో ఉన్నవాళ్లైతే కస్టమర్లతో అత్యంత సౌమ్యంగా, సరళంగా వ్యవహరించాల్సి వస్తుంది. కస్టమర్లను చిరునవ్వుతో పలకరిస్తే మీ వ్యాపారం మరింతగా పెరగవచ్చు. వీలైనంతవరకూ వివదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో పోటీని తట్టుకునేందుకు తప్పులు చేయవద్దు. సరైన జ్యోతిష్యుడిని సంప్రదించి మీ జాతకంలోని గ్రహాల కదలికకు అనుగుణంగా ఎలా ఉండాలి, ఏం చేయాలో తెలుసుకుంటే మంచిది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం అవసరం. అంతేకాకుండా రోజూ వారీ జీవితంలో బడ్జెట్‌కు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. అప్పులపాలు కాకుండా చూసుకోండి. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశమొస్తే తప్పకుండా వెళ్లాలి. ఈ వ్యవహారంలో డబ్బులు ఖర్చుపెట్టినా తప్పులేదంటున్నారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రమాదాలు ఎదురుకావచ్చు.

Also read: Luckiest Zodiac Sign: ఈ 3 రాశుల వారు అదృష్టవంతులు, జీవితంలో ఏదైనా సులభంగా సాధిస్తారు.. ఎందుకో తెలుసా?

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News