Saturn Transit 2024: శనిగ్రహం గోచారంలో మార్పు, మూడు రాశులకు జనవరి నుంచి మహర్దశ

Saturn Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఖగోళంలోని గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశించడం వల్ల అన్ని గ్రహాలపై ప్రతికూల, సానుకూల ప్రభావముంటుందని నమ్మకం. శని గ్రహం గోచారం ఇందులో అత్యంత కీలకం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 14, 2023, 12:00 PM IST
Saturn Transit 2024: శనిగ్రహం గోచారంలో మార్పు, మూడు రాశులకు జనవరి నుంచి మహర్దశ

Saturn Transit 2024: జ్యోతిష్యం ప్రకారం శని గ్రహం కదలికలకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. శని గ్రహం స్థితి వచ్చే ఏడాది అంటే 2024లో చాలా ప్రత్యేకం కానుంది. కొత్త సంవత్సరంలో శనిగ్రహం గోచారం మూడు రాశులవారికి మహర్దశ పట్టించనుంది. ఈ మూడు రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభమైనట్టేనంటున్నారు జ్యోతిష్య పండితులు.

హిందూ జ్యోతిష్య నమ్మకాల ప్రకారం శని గ్రహం గోచారానికి రెండున్నరేళ్లు పడుతుంది. 2023లో శని గ్రహం కుంభరాశిలో ప్రవేశించాడు. 2024లో కూడా ఇదే రాశిలో గోచారం కొనసాగుతుంది. ఇదే రాశిలో కొనసాగుతూనే 2024లో అంటే కొత్త సంవత్సరంలో దిశ మారి వెండి మార్గంలో పయనించనున్నాడు. జ్యోతిష్యం ప్రకారం వెండి మార్గమంటే అత్యంత మహత్యం కలిగిందిగా భావిస్తారు. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుంది. ముఖ్యంగా మూడు రాశులకు అత్యంత శుభప్రదం కానుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదుగుదల కన్పిస్తుంది. ఊహించని ధన సంపదలు వచ్చిపడతాయి. 

శని మార్గంలో మార్పు తులా రాశి జాతకులకు ఊహించని లాభాలు ఆర్జించనుంది. ఉద్యోగస్థులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా పదోన్నతి ఉంటుంది. వ్యాపారులకు ఊహించని లాభాలుంటాయి. అంతేకాకుండా పెండింగులో నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతాయి. కొత్త ఇళ్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశముంది. కొత్త పనులు ప్రారంభించవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

మీన రాశి జాతకులకు 2024లో అంతా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనే కల నెరవేరుతుంది. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంటుంది. పెండింగులో ఉన్న డబ్బులు లేక రావనుకున్నవి చేతికి అందుతాయి. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. నిరుద్యోగులకు మంచి రోజులు. ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఆర్ధికంగా ఈ జాతకం వ్యక్తులు పటిష్టమైన స్థితిలో ఉంటారు. 

కర్కాటక రాశి జాతకులకు శని గ్రహం మార్గంలో మార్పు కారణంగా ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారం విస్తృతమై మంచి లాభాలు ఆర్జిస్తారు. పెద్ద పెద్ద డీల్స్ చేతికి అందుతాయి. ఊహించని రూపంలో ధనలాభం కలుగుతుంది. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభించడమే కాకుండా పదోన్నతి ఉంటుంది. కొత్త ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కోర్కెలు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 

Also read: Venus Transit 2023: ఈ రాశులవారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో లగ్జరీ జీవితాలు ప్రారంభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News