Sun Transit 2023: ఈ 3 రాశుల వారు రాబోయే 22 రోజులు రాజా లాంటి జీవితం అనుభవిస్తారు..ఎందుకో తెలుసా?

Sun Transit 2023: సూర్య గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. ఈ ప్రభావం కారణంగా కర్కాటక రాశి వారితో పాటు కన్యా రాశి ఇతర రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర చెబుతున్నారు. అయితే ఈ సంచారం కారణంగా ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2023, 11:17 AM IST
Sun Transit 2023: ఈ 3 రాశుల వారు రాబోయే 22 రోజులు రాజా లాంటి జీవితం అనుభవిస్తారు..ఎందుకో తెలుసా?

Sun Transit 2023: జ్యోతిష్య శాస్త్రం సూర్యగ్రహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు రాజుగా భావిస్తారు. కాబట్టి సూర్య గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. అయితే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ గ్రహం నవంబర్ 17వ తేదీన తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి 22 రోజులపాటు సూర్యుడి అనుగ్రహం లభించబోతోంది. సూర్య గ్రహ సంచారం కారణంగా ఏయే రాశుల వారికి అదృష్టం రెట్టింపు అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

22 రోజులపాటు ఈ రాశుల వారికి లాభాలే లాభాలు:
మిథున రాశి:

సూర్యుడి సంచారం కారణంగా ఈ రాశి వారికి అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సోదరుల నుంచి మద్దతు లభించి ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. దీంతోపాటు ఈ రాశి వారికి సమాజంలో గౌరవంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. సూర్యుని సంచారం కారణంగా ఈ రాశి వారికి ధైర్యం పెరిగి ఎలాంటి పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా జీవిత భాగస్వామితో మంచి సమయం గడిపేందుకు ఇదే సరైన సమయంలో భావించవచ్చు. దీని కారణంగా దాంపత్య జీవితంలో కూడా ఊహించని లాభాలు కలుగుతాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వైవాహిక జీవితంలో కూడా ఆనందాన్ని పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

కర్కాటక రాశి:
22 రోజులపాటు కర్కాటక రాశి వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వారికి ఇది అనుకూలమైన సమయం. అంతేకాకుండా సమాజంలో మంచి గుర్తింపు లభించడమే కాకుండా గౌరవం, కీర్తి, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఈ సమయంలో వీరు ఎక్కువగా కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అంతేకాకుండా వైవాహిక జీవితం కూడా హ్యాపీగా సాగుతుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు మంచి శుభవార్తలు వింటారు. దీంతోపాటు ఉద్యోగాలు చేస్తున్న వారికి ఊహించని లాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా కొత్త పనులు ప్రారంభించే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. విద్యా రంగంలో కొనసాగుతున్న వారికి ఆర్థికంగా ఊహించని లాభాలు కలుగుతాయి. 

Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  

కన్యా రాశి:
కన్యా రాశి వారికి కుటుంబ సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. ఈ సూర్య గ్రహ సంచారం కారణంగా ఎప్పటినుంచో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక వైవాహిక జీవితం గడుపుతున్న వారు ఎంతో ఆనందంగా ఉంటారు. ఆర్థికంగా కూడా ఊహించని లాభాలు కలుగుతాయి. సమాజంలో వీరికి గౌరవంతో పాటు పదవులు ప్రతిష్టలు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు.

Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News