Heavy Heatwaves in Hyderabad: బయటకు రాకండి బాబోయ్‌.. కేవలం ఒక్కరోజులోనే వడదెబ్బకు 19 మంచి మృత్యువాత..!

Heavy Heatwaves in Hyderabad: హైదరాబాద్‌ అగ్నిగుండంలా మారిపోయింది. కేవలం ఒక్కరోజులోనే వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 19 మంచి మృత్యువాత పడ్డారు. ఇది రికార్డు స్థాయిలో నిన్న శనివారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఎండలకు ఫలితం.

Heavy Heatwaves in Hyderabad: హైదరాబాద్‌ అగ్నిగుండంలా మారిపోయింది. కేవలం ఒక్కరోజులోనే వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 19 మంచి మృత్యువాత పడ్డారు. ఇది రికార్డు స్థాయిలో నిన్న శనివారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఎండలకు ఫలితం. ఈనేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో ఎట్టిపరిస్థితుల్లో బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు హెచ్చిరిస్తున్నారు.
 

1 /6

హైదరాబాద్ అగ్నిగుండంలా మారిపోయింది. కేవలం రాజధాని నగరమే కాదు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రత్తలు నిప్పుల కొలిమిలా మారిపోయింది. ఏప్రిల్‌ నుంచే దంచికొడుతున్న ఎండలు ప్రజలను భయభ్రాంతులను గురిచేస్తున్నాయి. నిన్న అంటే శనివారం ఒక్కరోజులోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 19 మంది వడదెబ్బకు అసువులుబాసారు. ఒకవైపు లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు కొనసాగుత్తున్నవేళ రాష్ట్రంలో నిప్పులకొలిమిలా మారిపోయింది. అడుగు తీసి బయటకు వేయాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.  

2 /6

రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలు ఎన్నో. నాలుగు రూపాయాలు సంపాదించాలన్నా బయటకు వెళ్లి పనులు చేసుకోవాల్సిందే. అయితే, ఈ ఎండవేడిమికి తట్టుకోలేక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇది ముఖ్యంగా గాలిలో తేమ శాతం తగ్గిపోవడమే ప్రధాన కారణం.   

3 /6

ప్రస్తుతం హైదరాబాద్‌లో గాలిలో తేమ 15 శాతానికి పడిపోయింది. ఎన్నాడు లేని విధంగా రికార్డు స్థాయిలో సామాన్య ప్రజలను ఎండలు బెంబేలెత్తేలా చేస్తున్నాయి. ఈనేపథ్యంలో వాళ్లు రోడ్డెక్కాలంటేనే భయపడిపోతున్నారు.  

4 /6

కేవలం హైదరాబాద్‌లో మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భానుడి ప్రతాపం తీవ్రరూపం దాల్చుతోంది. శనివారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 44.5 డిగ్రీలు అత్యధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2015 రికార్డును ఇది బ్రేక్‌ చేసింది. ఏప్రిల్‌ నుంచి దంచికొడుతున్న ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి కానీ, తగ్గుతున్న ఆనవాళ్లు కనిపించడం లేదు.  

5 /6

ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. కానీ, వారివారి అవసరలు, పనులు దృష్ట్యా బయటకు వెళ్లాల్నిన దుస్థితి ఏర్పడుతోంది. వడదెబ్బ బారిన పడుతున్నారు. ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈనేపథ్యంలో పిల్లలు, వృద్ధులు మరింత ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ సమయంలో బయటకు రాకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

6 /6

ఒక్కరోజులోనే 19 మంది మృతి.. శనివారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఎండ తీవ్రతకు నిన్న కేవలం ఒక్కరోజులోనే రాష్ట్రవ్యాప్తంగా 19 మంది మృత్యువాత పడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో తీవ్రవడగాల్పులు నమోదయ్యాయి. కరీంనగర్‌, నల్గొండ, నారాయణపేట, మంచిర్యాల, జగిత్యాల పలు జిల్లాల్లో 19 మంది వడదెబ్బకు గురై చనిపోయారు.