PM MOdi: పాక్ ను గాజులు తొడుక్కునేలా చేస్తాం.. ఎన్నికల ప్రచారంలో మోదీ స్ట్రాంగ్ ధమ్కీ..

Bihar election campaign: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఇంటియా కూటమిపై మండిపడ్డారు. ఇండియా కూటమిలో ఉన్న నేతలంతా పాక్ అంటే భయపడిపోతున్నారని విమర్శించారు. ఇలాంటి వారు దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్తారని ప్రచారంలో ప్రశ్నించారు.  

Written by - Inamdar Paresh | Last Updated : May 13, 2024, 08:35 PM IST
  • ఇండియా కూటమిపై మండిపడిన పీఎం మోదీ..
  • పాక్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్..
PM MOdi: పాక్ ను గాజులు తొడుక్కునేలా చేస్తాం.. ఎన్నికల ప్రచారంలో మోదీ స్ట్రాంగ్ ధమ్కీ..

PM MOdi Hot comments on congress party and pakistan in muzaffarpur: దేశ ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ లోని ముజఫర్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ఇండియా కూటమిపై మండిపడ్డారు. ఇండియా కూటమిలో ఉన్న వారంతా పాక్ ను చూసి భయపడిపోతున్నారని విమర్శించారు. ఇలాంటి పిరికి వాళ్లు, ధైర్యంలేని వారు దేశం కోసం గట్టిచర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. కొందరు ఇటీవల ముంబై దాడులు, సర్జీకల్ స్ట్రైక్ లపై వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నారు. ఇలాంటి వాళ్లు దేశం కోసం ఏచేస్తారని మోదీ ఫైర్ అయ్యారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాక్ కు వంతపాడుతుందని, పాక్ ను ఒక బూచీలాగా చూసి భయపడుతుందన్నారు.

Read more: Smell of Cooking Food: వంట స్మెల్ చూసి వావ్ అంటున్నారా..?.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎన్ఓఏఏ పరిశోధకులు..

ఇటీవల  నేషనల్ కాన్ఫరెన్స్ (NC) చీఫ్ మరియు J&K మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. పాక్ ఆక్రమిత-కాశ్మీర్ (PoK) ను భారత్‌లో విలీనానికి పాకిస్తాన్ అనుమతించదని, తాము గాజులు వేసుకుని కూర్చోలేదని,  అణు బాంబులను ప్రయోగించడానికి తాము రెడీ ఉన్నామంటూ వ్యాఖ్యలు చేశారు. గతంలో.. పీఓకేలోని ప్రజలు స్వయంగా భారత్‌లో విలీనాన్ని డిమాండ్ చేస్తారని, న్యూఢిల్లీ బలవంతంగా ఉపయోగించాల్సిన అవసరం లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అబ్దుల్లా పై విధంగా స్పందించారు. 

ఇక తాజాగా, ఫరూక్ అబ్లూల్లా వ్యాఖ్యలకు మోదీ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పాక్ గాజులు తొడుక్కొలేదన, ఫరూక్ అంటున్నారు.. కానీ తొందరలోనే పాక్ ను గాజులు తొడుక్కునేలా చేస్తామంటూ ఫరూక్ కు మోదీ..  స్ట్రాంగ్ ధమ్కీ ఇచ్చారు. భారతదేశం యొక్క పొరుగు దేశం ఆహారం,  విద్యుత్తు అంతరాయం గురించి తరచుగా వింటున్నామని, ఇప్పుడు గాజులు కూడా వేసుకొవాల్సిన పరిస్థితి రావోచ్చని మోదీ అన్నారు.

Read more: Members of Parliament: ఎంపీగా గెలిచిన వారికి వచ్చే జీతం, పొందే సౌకర్యాలు ఏంటో తెలుసా..?

పాకిస్థాన్ పై.. ఇండియా కూటమి నేతల.. అనుకూల వ్యాఖ్యలపై  ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి నేతలంతా.. తమ కలలో పాకిస్థాన్ అణు బాంబును చూసి భయపడుతున్నారని ప్రధాని అన్నారు. ఇంత పేట్రేగిపోయిన పార్టీలు, నాయకులు దేశాన్ని నడపగలరా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ , భారత కూటమి ప్రజలు కలలో కూడా పాకిస్తాన్ అణు బాంబును చూసి భయపడుతున్నారు. అలాంటి పార్టీలు, నాయకులు దేశాన్ని నడపగలరా? వారు 'పాకిస్తాన్ నే చుడియాన్ నహీ పెహ్నీ హై' అంటారు. మేము 'పెహ్నా దేంగే' అంటామంటూ మోదీ ఎన్నికళ పాక్ తో పాటు, ఇండియా కూటమికి కూడా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు.  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News