Woman Argue For kurkure: భర్తకు బిగ్ షాక్.. కుర్ కురే కొనివ్వలేదని భార్య ఏంచేసిందో తెలుసా..?

Uttar pradesh: మహిళ తన భర్తకు ఇంటికి వచ్చేటప్పుడు కుర్ కురే తీసుకురమ్మని చెప్పింది. ఎంతగా చెప్పిన ఆయన ఇంటికి వచ్చేటప్పుడు తీసుకుని రావడం మాత్రం మరచిపోయాడు. దీంతో ఇంటికి వచ్చాక భర్తతో గొడవకు దిగింది. ఇది కాస్త పీక్స్ కు చేరిపోయింది.  

Written by - Inamdar Paresh | Last Updated : May 14, 2024, 05:57 PM IST
  • భర్తకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భార్య..
  • విషయం తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పోలీసులు..
Woman Argue For kurkure: భర్తకు బిగ్ షాక్.. కుర్ కురే కొనివ్వలేదని భార్య ఏంచేసిందో తెలుసా..?

Woman seeks divorce from husband forgets to bring kurkure in agra: కొందరు పెళ్లి తర్వాత షాడిస్టులుగా ప్రవర్తిస్తుంటారు. తమ భార్య అందంగా లేదని, వంటరాదని భర్యలను వేధిస్తుంటారు. కట్నంతేలేదని, చికెన్ వండరాలేదని భార్యలను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఇతరులతో మాట్లాడిన అనుమానంతో చూస్తుంటారు. మనం కోసం అన్ని వదిలేసి వచ్చిన వాళ్లను సూటీ పోటీ మాటలతో వేధిస్తుంటారు. ఇక ఆడవాళ్లు కూడా తామేం తక్కువ తినలేదన్నట్లు ఉంటారు. ఇతరులతో కంపెర్ చేస్తు, తమ భర్తను చులకన చేస్తుంటారు. తమ భర్త చక్కగా చూసుకొవడంలేదని సినిమాలు, షికార్లకు తిప్పడంలేదని వేధిస్తుంటారు. అంతేకాకుండా.. బంగారం, కార్లు కొనివ్వలేదని ఇలా అనేక రకలుగా ఇబ్బందులకు గురిచేస్తుంటారు.

Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?

తమకు ప్రైవేసీ ఇవ్వడంలేదని, పెళ్లయిన తర్వాత తమ భర్త సరిగ్గా పట్టించుకోవడంలేదని, వేరు కాపురం పెడుదామని వేధిస్తుంటారు. ఇక కొందరైతే చిన్న చిన్న విషయాలకు భర్తలతో గొడవలు పడి విడాకుల వరకు వెళ్లిపోతుంటారు. మల్లెపూలు కొనివ్వలేదని, తనతో మాట్లాడటం లేదని, ఈ మధ్య కాలంలో భర్త తనను అస్సలు ఏమి అనడంలేదని ఒక మహిళ విడాకుల కోసం వెళ్లిన ఘటన వార్తలలో నిలిచింది. తాజాగా, ఒక మహిళ కుర్‌ కురే కొనివ్వలేదని విడాకులు కావాలని పోలీసు స్టేషన్ కు వెళ్లింది. ఈఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తివివరాలు..

ఉత్తరప్రదేశ్ లోని ఒక మహిళ షాడిస్ట్ గా ప్రవర్తించింది. ఆగ్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు మహిళ.. కుర్ కురే కు అడిక్ట్ అయ్యింది. రోజుకు కుర్ కురేలు తినకుండా అస్సలు ఉండేది కాదు. ప్రతిరోజు పదుల సంఖ్యలో కుర్ కురేలు తినేది. ఈ నేపథ్యంలో ఆమె ఒక రోజు తన భర్తకు ఇంటికి వచ్చేటప్పుడు కుర్ కురే తేవాలని కోరింది. పాపం.. ఆ భర్త ఆరోజు ఏమైందో ఏంటో కానీ.. ఆ విషయం పూర్తిగా మర్చిపోయాడు. అంతేకాకుండా..అలానే చేతులు ఊపుకుంటూ ఇంటికి వచ్చేశాడు. భర్తను రాగానే భార్య.. కుర్ కురే ఎక్కడున్నాయని నిలదీసింది. తేలేదని భర్త చెప్పడంతో ఆవేశంతో ఊగిపోయింది.

Read more: Fight Breaks Out Mid flight: విమానంలో ఇదేం లొల్లి బాబోయ్.. లేడీ ఎయిర్ హోస్టెస్ ఆపిన ఆగకుండా.. వీడియో వైరల్..

దీంతో ఇద్దర మధ్య గొడవలు కాస్త పీక్స్ కు వెళ్లిపోయాయి. సదరు మహిళ ఇంట్లో ఒక్క నిముషం కూడా ఉండనని చెప్పి వెళ్లిపోయింది. అంతేకాకుండా.. తన భర్త వేధిస్తున్నాడని,  విడాకులు కావాలని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని స్టేషన్ కు రప్పించి విడాకుల ఘటనపై ఆరా తీశారు. ఇద్దరికి కౌన్సిలింగ్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈఘటన మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News