Salaar 2: సలార్ 2 కోసం కొత్త విలన్.. మరొక ప్యాన్ ఇండియన్ నటుడితో ప్రభాస్..

Salaar 2 Latest Update : ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ 2 సినిమా మీద అంచనాలు రోజు రోజుకి.. పెరుగుతూ వస్తున్నాయి. స్టార్ కాస్ట్ తో ఈ సినిమా ప్రేక్షకులకు కనులువిందు చేయబోతోంది. ఇక ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మరొక పాన్ ఇండియా నటుడిని విలన్ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 18, 2024, 08:45 PM IST
Salaar 2: సలార్ 2 కోసం కొత్త విలన్.. మరొక ప్యాన్ ఇండియన్ నటుడితో ప్రభాస్..

Salaar 2 Release Date : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి సీక్వల్ గా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సలార్ శౌర్యంగ పర్వం సినిమా మీద కూడా అంచనాలు పెరిగిపోతూ వస్తున్నాయి. 

బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల బస్సులను నమోదు చేసుకున్న సలార్ సినిమా రెండవ భాగం గా సలార్ 2 భారీ అంచనాల మధ్య త్వరలోనే తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

సలార్ సినిమా లాగానే సలార్ 2 సినిమా కూడా స్టార్ కాస్ట్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అయితే సినిమా కోసం మరొక పాన్ ఇండియా నటుడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు షైన్ టామ్ చాకో. నాని దసరా సినిమాలో విలన్ గా నటించి.. తన నటనతో ఆకట్టుకున్న మలయాళం నటుడు షైన్ టామ్ చాకో.  ఇప్పుడు ఈ మలయాళీ నటుడు ప్రభాస్ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నారట. 

మరి టాలీవుడ్ లో ఈ సినిమా షైన్ టామ్ చాకో కి ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని హొంబాలే ఫిలిమ్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రవి బస్రూరు సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో పృధ్విరాజ్ సుకుమారన్, శృతిహాసన్, బాబి సింహా, జగపతిబాబు, శ్రియ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

మరోవైపు ప్రభాస్ కల్కి సినిమాతో కూడా బిజీగా ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదలకి సిద్ధం అవుతోంది. ఇది మాత్రమే కాక ప్రభాస్ చేతిలో రాజా సాబ్, స్పిరిట్ వంటి సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి.

Read more: TTD Online Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. డిటెయిల్స్ ఇవే..

Read more: Vijayawada boy cpr: నువ్వు గ్రేట్ తల్లీ.... రోడ్డుపైన బాలుడికి సీపీఆర్ చేసిన లేడీ డాక్టర్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News