Janhvi Kapoor Sister : ఒకరిది ఇంకొకరు వేసుకుంటారా?.. నెటిజన్ ప్రశ్న.. జాన్వీ కపూర్‌ సోదరి రిప్లై వైరల్

Anshula kapoor on Janhvi Kapoor Dress అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు ఒకరి బట్టలు ఒకరు మార్చుకుని వేసుకుంటూ ఉంటారు. ఇది అన్ని చోట్లా సర్వసాధారణమే. అయితే ఇదే ప్రశ్నను అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్‌ని నెటిజన్లు అడిగారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2023, 11:52 AM IST
  • నెట్టింట్లో అర్జున్ కపూర్ సోదరి సందడి
  • అభిమానులతో అన్షులా కపూర్ చిట్ చాట్
  • జాన్వీ కపూర్‌ మీద కొంటె కామెంట్లు
Janhvi Kapoor Sister : ఒకరిది ఇంకొకరు వేసుకుంటారా?.. నెటిజన్ ప్రశ్న.. జాన్వీ కపూర్‌ సోదరి రిప్లై వైరల్

Janhvi Kapoor Sister : బాలీవుడ్‌లో కపూర్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక బోనీ కపూర్‌ కూతుళ్లు, కొడుకు గురించి తెలిసిందే. ఆయన ప్రేమ, పెళ్లిళ్ల విషయాలు తెలిసిందే. అయితే శ్రీదేవీ ఉన్నంత కాలం అర్జున్ కపూర్, అన్షులా కపూర్‌లకు, జాన్వీ, ఖుషి కపూర్‌ల మధ్య అంత సన్నిహిత సంబంధాలు ఉండేవి కాదు. శ్రీదేవీ చనిపోయిన తరువాతే వీరి మధ్య కాస్త బంధం బలపడినట్టు కనిపిస్తోంది.

అర్జున్ కపూర్ తన సొంత చెల్లి అన్షులాను చూసినట్టుగానే జాన్వీ, ఖుషీలను దగ్గరకు తీసుకున్నాడు. వీరంతా కలిసి చిల్ అవుతుంటారు. అన్షుల కాస్త లావుగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అన్షులా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా అన్షులా ఇన్ స్టాగ్రాంలో తన అభిమానులతో చిట్ చాట్ చేసింది.

జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఎప్పుడైనా మీ డ్రెస్సులు ఎక్స్ చేంజ్ చేసుకున్నారా? అని అడిగాడు. దీనికి అన్షులా ఇలా సమాధానం ఇచ్చింది. నాకు కూడా వాళ్ల డ్రెస్సులు వేసుకోవాలని ఉంటుంది.. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే.. నాకు అవి పట్టవు.. ఎప్పడైనా జాన్వీ కపూర్ మా ఇంటికి వస్తే మాత్రం నా బట్టలన్నీ పట్టుకెళ్తుంది.. పైజామాలు, స్వెట్ షర్ట్‌లు ఇలా అన్నీ పట్టుకెళ్తుంటుంది.. అని జాన్వీ కపూర్ గురించి చెప్పుకొచ్చింది.

అన్షులా కామెంట్ల మీద జాన్వీ కపూర్ ఇలా స్పందించింది. వాటిని మళ్లీ ఎప్పుడూ కూడా రిటర్న్ ఇవ్వలేదు అని కౌంటర్ వేసింది. అంటే జాన్వీ మాత్రం తన అక్క డ్రెస్సులన్నీ కూడా వాడేస్తుందని అందరికీ అర్థమైంది. జాన్వీ కపూర్ నెట్టింట్లో చేసే అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎద అందాల ప్రదర్శనతో యూత్‌ను ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటుంది.

జాన్వీ కపూర్ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి కనిపిస్తుండటంతో ప్రేమలో ఉన్నట్టుగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే జాన్వీ కపూర్ తెలుగు సినిమాల్లోకి రాబోతోన్నట్టుగా తెలుస్తోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో రాబోతోన్న చిత్రంలో జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్టు సమాచారాం.

Also Read:  Disha Patani Pics : చెక్కిన శిల్పంలా ఉంది!.. ఒంపుసొంపులు కనిపించేలా దిశా పటానీ అందాల ప్రదర్శన

Also Read: Deva Katta : ఆ స్క్రిప్ట్ నాదే.. బీర్ బాటిల్స్ నావి కాదు.. దేవా కట్టా పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News