SIP Equity: ఎస్ఐపీ ఈక్విటీలో భారీ లాభాలు, పదివేల పెట్టుబడితో 12 లక్షల రిటర్న్స్, ఎలాగంటే

SIP Equity: ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు స్మాల్ ఇన్వెస్ట్‌‌మెంట్ ప్లాన్ సురక్షితమైన మార్గం. ఇందులో అద్భుత లాభాలు కలుగుతాయి. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 15, 2022, 03:26 PM IST
SIP Equity: ఎస్ఐపీ ఈక్విటీలో భారీ లాభాలు, పదివేల పెట్టుబడితో 12 లక్షల రిటర్న్స్, ఎలాగంటే

SIP Equity: ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు స్మాల్ ఇన్వెస్ట్‌‌మెంట్ ప్లాన్ సురక్షితమైన మార్గం. ఇందులో అద్భుత లాభాలు కలుగుతాయి. ఆ వివరాలు మీ కోసం..

ఇటీవలి కాలంలో ఎస్ఐపీ ద్వారా మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇందులో పెట్టుబడి చాలా సురక్షితంగా ఉంటుంది. మార్కెట్‌లో ఎదురయ్యే ఒడిదుడుకుల ప్రభావం దీనిపై పడదు. ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడికి ఇదే అనువైన మార్గం. ఈ విధానం వల్ల మంచి లాభాలు ఆర్జించవచ్చు. మ్యూచ్యువల్ ఫండ్ నిపుణులు అందిస్తున్న ఇతర వివరాలు ఇలా ఉన్నాయి..

ఈక్విటీ మ్యూచ్యువల్ ఫండ్‌లో దీర్ఘకాలం పెట్టబడి ఉంచితే..కాంపౌండింగ్ లాభాలు కలుగుతాయి. హైబ్రీడ్, డేట్ ఫండ్‌తో పోలిస్తే ఈక్విటీ మార్కెట్ అనేది ఎక్కువ లాభాలకు ఆస్కారం కలిగి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఒడి దుడుకుల నేపధ్యంలో కొద్దిగా సమయం పట్టవచ్చు. ప్రతి నెలా పదివేల రూపాయలు ఎస్ఐపీలో పెట్టుబడి పెడితే..ఐదేళ్లలోనే 12 లక్షలైపోతుంది. ప్రతి నెలా 10 వేల చొప్పిన ఐదేళ్లలో వాస్తవానికి జమయ్యే మొత్తం 6 లక్షలౌతుంది. 

ఈ ఫండ్ ప్రారంభమైనప్పటి నుంచి క్వాంట్ యాక్టివ్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ 14.10 శాతం ఒక ఏడాది రిటర్న్‌తో 21.08 శాతం చొప్పున అందుతుంది. అంటే ఎవరైనా ఐదేళ్ల క్రితం ఇందులో నెలకు పదివేల రూపాయలతో ప్రారంభిస్తే..ఇప్పుడది పెరిగి 12.72 లక్షలకు చేరుకుంది. ఈ ఫండ్ ఐదేళ్ల కాలంలో 30.62 శాతం ఏడాదికి రిటర్న్ ఇచ్చింది. 

క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ఎలా పెరిగింది

క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్రారంభం నుంచి ప్రతి యేటా 17.46 శాతం రిటర్న్ అందించింది. ఏడాది క్రితం 23.56 శాతం రిటర్న్ ఇచ్చింది. ఐదేళ్ల క్రితం నెలకు పది వేల రూపాయలతో పెట్టుబడి పెట్టినవారికి ఐదేళ్ల తరువాత కార్పస్ ఫండ్ పెరిగి 12.83 లక్షల రూపాయలైంది. ఎందుకంటే ఐదేళ్లలో ఎస్ఐపీ 30.97 శాతం రిటర్న్ ఇచ్చింది. 

పీజీఐఎమ్ ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చ్యూనిటీ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ఏడాది కాలంలో 12.05 శాతం రిటర్న్ ఇచ్చింది. మిగిలిన కాలంలో 20.54 శాతం రిటర్న్ అందించింది. ఇందులో ఎస్ఐపీ చేసినవారికి గత ఐదేళ్లకాలంలో 31.40 శాతం రిటర్న్ లభించింది. ఐదేళ్ల క్రిత నెలకు పది వేలతో పెట్టుబడికి 12.96 లక్షల రూపాయలు అందాయి.

Also read: Special Discount on iPhones: ఊహించని ధరకు ఐఫోన్ 13, ఐఫోన్ 11, ఐఫోన్ 12 మినీ, ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News