EPF Balance Check: ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్‌ను ఒక్క మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోండి

EPF Balance Check | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు భవిష్య నిధి ఖాతాలు అందిస్తోంది. ప్రస్తుతానికి మొత్తం ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు EPFO సేవలు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు నగదుపై 8.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 5, 2021, 03:58 PM IST
EPF Balance Check: ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్‌ను ఒక్క మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోండి

ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్‌వోలు పలు ప్రయోజనాలు అందిస్తున్నాయి. ఈపీఎఫ్ ఖాతాలలో నగదు నిల్వలలపై వడ్డీ రేట్లు తగ్గించడం లేదని, వాటిని యథాతథంగా కొనసాగించనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో  పలు సౌకర్యాలను అందిస్తుంది. 

తమ పీఎఫ్ ఖాతాలో నగదు ఎంత ఉంది, పింఛన్ ఎంతమేర ప్రతి నెలా జమ అవుతుందో తెలుసుకోవాలని భావిస్తారు. ఒకవేళ ఈపీఎఫ్(EPF) ఖాతాదారులు ఆన్‌లైన్ సౌకర్యాన్ని వినియోగించడం తెలియకపోయినా, మరో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలోనూ సులువుగా PF ఖాతాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ మరియు చివరగా పీఎఫ్ ఖాతాలోకి ఎంత నగదు జమ చేశారన్న వివరాలు సైతం తెలుసుకునే అవకావాన్ని ఈపీఎఫ్‌వో(EPFO) కల్పించింది. 

Also Read: ITR Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టాలు, కొత్త నియమాలు ఇవే, ఎవరిపై ప్రభావం

ఈపీఎఫ్ ఖాతాలు కలిగి ఉన్న ఉద్యోగులు ఇప్పుడు మీరు ప్రావిడెంట్ ఫండ్ వివరాలను కేవలం ఒక్క మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌(EPFO Website)లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వారి పీఎఫ్ ఖాతా నగదుతో పాటు చివరగా కాంట్రిబ్యూషన్ వివరాలను పొందవచ్చు. 

ఆ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చిన సదరు ఉద్యోగి యూఏఎన్ నెంబర్, ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌కు పీఎఫ్ ఖాతాలోని నగదు వివరాలు మెస్సేజ్ రూపంలో అందుతాయి. అయితే పీఎఫ్(Provident Fund) ఖాతాదారులు ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో తమ యూఏఎన్ నెంబర్‌కు ఎవరైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్లలో ఏదైనా ఒకదాని వివరాలు అప్‌డేట్ చేసిన వారికి పీఎఫ్ బ్యాలెన్స్‌(PF Balance)తో పాటు చివరగా ఎంత మేర నగదు పీఎఫ్ ఖాతాకు జమ చేసిన వివరాలు అందుతాయి.

Also Read: EPFO: తెరపైకి కొత్త వేతన కోడ్, EPFతో పాటు జీతాల్లో ఏప్రిల్ 1 నుంచి మార్పులు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News